భారతదేశం, ఏప్రిల్ 1 -- భారత వినియోగదారులకు షాక్​! అజిత్రోమైసిన్​ నుంచి ఐబూప్రొఫిన్​ వరకు.. నిత్యం వినియోగించే మందులతో పాటు మొత్తం మీద 900 అత్యవసర ఔషధాల ధరల పెరిగాయి. మందుల ధరలను 1.74శాతం పెంచుతున్నట్టు, అది ఏప్రిల్​ 1నే అమల్లోకి వస్తుందని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్​పీపీఏ) ప్రకటించింది.

తాజాగా ధరలు పెరిగిన మందుల జాబితాలో క్రిటికల్ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, డయాబెటిస్​కి సంబంధించినవి సైతం ఉన్నాయి.

"డ్రగ్స్​ (ధరల నియంత్రణ) ఆర్డర్, 2013 (డీపీసీఓ, 2013) నిబంధనల ప్రకారం, షెడ్యూల్డ్ మందుల గరిష్ట ధరలను టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) (అన్ని వస్తువులు) ఆధారంగా యేటా సవరిస్తారు. డబ్ల్యూపీఐ (అన్ని కమోడిటీలు)లో వార్షిక మార్పుల ఆధారంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్డ్ మందుల గరిష్ట ధరలను 1.4.2024 నుంచి 0.00551 శాతం పెంచారు. డీపీ...