భారతదేశం, మార్చి 21 -- ఆర్థిక అవసరాల కారణంగా పర్సనల్​ లోన్​ తీసుకునే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతోంది. అయితే లోన్​ తీసుకోవడమే కాదు, దాని ఔట్​స్టాండింగ్​ బ్యాలెన్స్​ని ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఐసీఐసీ బ్యాంక్​ నుంచి పర్సనల్​ లోన్​ తీసుకుని ఉంటే బ్యాలెన్స్​ ఎలా చెక్​ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

మీ పర్సనల్​ లోన్​ ఔట్​స్టాండింగ్​ బ్యాలెన్స్​ని ట్రాక్ చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా మేనేజ్​ చేయడానికి, పేమెంట్స్​ మిస్​ అవ్వకుండా చూసుకోవడానికి, అధిక ఆర్థిక భారం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా పర్యవేక్షించడం వల్ల మీ ఖర్చులను ప్లాన్ చేయడానికి, జరిమానాలను నివారించడానికి, మంచి క్రెడిట్ స్కోరును నిర్వహించడానికి కూడా ఇది పనికొస్తుంది.

మిగిలిన బ్యాలెన్స్ తెలుసుకోవడం వల్ల వడ్డీ రేటు భారాన్ని త...