భారతదేశం, మార్చి 10 -- ఈ మధ్య కాలంలో దేనికైనా లోన్​ సులభంగా దొరికేస్తోంది! అది క్రెడిట్​ కార్డ్​ అయినా లేక పర్సనల్​ లోన్​ అయినా! ప్రజలు అనేక కారణాలతో వివిధ రకాల లోన్​లు తీసుకుంటున్నారు. కానీ కొంతమంది వాటిని తిరిగి చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జరిగిన నష్టం తెలుస్తున్నా, ఏం చేయాలో అర్థంకాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో మీరు ఉన్నారా? అయితే ఒక్కసారి ఇది చదవండి. అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో ఇక్కడ తెలుసుకోండి..

మీ ప్రస్తుత రుణాలన్నీ, వాటి వడ్డీ రేట్ల ప్రాతిపదికన లిస్ట్​ తయారు చేసుకోండి. చాలా సందర్భాల్లో క్రెడిట్ కార్డు రేట్లు, పర్సనల్ లోన్ రేట్లు ప్రామాణిక రుణ రకాల కంటే ఎక్కువగా ఉంటాయి. రుణ చెల్లింపునకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు చివరికి మీ మొత్తం చెల్లింపులపై పెద్ద మొత్తంలో వడ్డీని ఆదా చేస్తారు.

క్రెడిట్​ కార్డ్​...