భారతదేశం, మార్చి 15 -- డబ్బు అవసరాల కోసం ఇప్పుడు చాలా మంది పర్సనల్​ లోన్​వైపు చూస్తున్నారు. కానీ పర్సనల్​ లోన్​లో వడ్డీ రేట్లు సాధారణ రుణాల కన్నా అధికంగా ఉంటాయి. దీని వల్ల లోన్​ తీసుకున్న వారిపై భారం పెరుగుతుంది. మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారా? పర్సనల్​ లోన్​ వడ్డీ భారాన్ని తట్టుకోలేకపోతున్నారా? అయితే ఇది మీకోసమే! లోన్​ తీసుకున్న తర్వాత కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఎలా అంటే..

పర్సన్​ లోన్​ ఒక్కటే కాదు, ఏ లోన్​ విషయంలోనైనా మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం చాలా అవసరం! తద్వారా మీరు మంచి రుణాన్ని పొందవచ్చు. మీరు నమ్మదగిన వ్యక్తి అని మీ క్రెడిట్​ స్కోర్​, మీకు లోన్​ ఇచ్చిన వ్యక్తికి తెలియజేస్తుంది. దీనికి మీరు తక్కువ వడ్డీ రేట్లను పొందుతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్-అర్...