భారతదేశం, మార్చి 29 -- మీరు పర్సనల్​ లోన్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! ఇటీవలి కాలంలో పర్సనల్​ లోన్​ చాలా సులభంగా లభిస్తోంది. కానీ ఆ ఉచ్చులో పడకూడదు! పర్సనల్​ లోన్​ అనేది రిస్క్​తో కూడుకున్నది. అందుకే రుణం పొందే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే..

1. అధిక వడ్డీ రేట్లు: మీరు పర్సనల్​ లోన్​ తీసుకునే తొందరలో ఉన్నప్పుడు.. అధిక ఏపీఆర్ (వార్షిక శాతం రేటు) వసూలు చేస్తున్న రుణదాత నుంచి కూడా ఆఫర్​ని అంగీకరించే ప్రలోభాలు ఉండవచ్చు. కొన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. కానీ హిడెన్​ ఛార్జీల కారణంగా వాటి ఏపీఆర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వడ్డీ రేటుకు బదులుగా ఎపీఆర్​ని మదింపు చేయాలి.

2. ప్రాసెసింగ్ ఫీజు, ఛార్జీలు: రుణ గ్రహీతలు భరించే అదనపు ఖర్చు అధిక ప్రాసెసింగ్ ఫీజు. లేట్ పేమెంట్ పెనాల్టీల...