భారతదేశం, సెప్టెంబర్ 26 -- అనుకోని ఖర్చులను లేదా ముఖ్యమైన వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి పర్సనల్ లోన్ అనేది ఇప్పుడు చాలా మంది ఉపయోగించే ఆర్థిక సాధనంగా మారింది. అయితే మీరు దరఖాస్తు చేసిన రుణాన్ని ఆమోదించే ముందు.. అప్పు ఇచ్చే సంస్థలు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ పర్సనల్ లోన్ దరఖాస్తు ఆమోదం పొందాలంటే, గతంలో మీరు చేసిన రుణాల తిరిగి చెల్లింపు చరిత్ర (రీపేమెంట్​ హిస్టరీ), క్రెడిట్ స్కోర్, ఉద్యోగ చరిత్ర, చెల్లింపులు మిస్​ చేయడం వంటి అనేక అంశాలు కీలకం. ఈ ముఖ్య విషయాలను అర్థం చేసుకుంటే, మీరు అనుకూలమైన వడ్డీ రేట్లపై లోన్ పొందే అవకాశాలు మెరుగుపడతాయి.

ప్రస్తుతం పర్సనల్ లోన్‌పై వర్తించే వడ్డీ రేట్లు వివిధ ఆర్థిక సంస్థలలో మారుతూ ఉంటాయి. రుణ మొత్తం, అప్పు ఇచ్చే సంస్థ రకం, రుణం రకం, తిరిగి చెల్లింపు వ్యవధ...