Hyderabad, ఏప్రిల్ 8 -- Payal Rajput Father: తెలుగులో ఆర్ఎక్స్ 100, మంగళవారంలాంటి సినిమాలతో పాపులర్ అయిన నటి పాయల్ రాజ్‌పుత్. తాజాగా తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారంటూ ఆమె ఓ పోస్ట్ చేసింది. మంగళవారం (ఏప్రిల్ 8) నుంచే కీమోథెరపీ కూడా ప్రారంభించినట్లు చెప్పింది. ఈ క్లిష్ట సమయంలో అందరి మద్దతు తనకు కావాలని కోరింది.

పాయల్ రాజ్‌పుత్ తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమెనే తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి ఆయనను బయటపడేయడానికి కిమ్స్ లో చికిత్స మొదలుపెట్టినట్లు కూడా చెప్పింది. అయితే ఇది తనను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నట్లు కూడా పాయల్ తెలిపింది. మంగళవారం (ఏప్రిల్ 8) ఆమె చేసిన ఓ సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

"అందరికీ నమస్కారం, మా నాన్న ఈ మధ్యే అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారు. కిమ్స్ హాస్పిట...