Hyderabad, మార్చి 5 -- OTT Women's day Web Series to watch: ఓటీటీ వచ్చిన తర్వాత ఎన్నో జానర్ల వెబ్ సిరీస్ వచ్చాయి. వాటిలో కొన్ని మహిళలే లీడ్ రోల్స్ గా చేసినవీ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వాటిని చూడొచ్చు. ఈ శనివారం (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీటిని మిస్ కాకుండా చూడండి.

ఆడది అంటే వంటింటికే పరిమితమయ్యే వ్యక్తి కాదు.. తలుచుకుంటే రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఏలుతుందని చాటి చెప్పే వెబ్ సిరీస్ మహారాణి. 1990లనాటి బీహార్ రాజకీయాలను ఆధారంగా చేసుకొని ఈ సిరీస్ తెరకెక్కించారు. సోనీలివ్ ఓటీటీలో ఇప్పటికే మూడు సీజన్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. రాణి భారతి అనే శక్తివంతమైన ఓ సీఎం పాత్రలో హుమా ఖురేషీ నటించిన ఈ సిరీస్ మహిళా సాధికారతకు అద్దం పట్టేదే.

ప్రముఖ నటి సుష్మితా సేన్ ...