భారతదేశం, ఏప్రిల్ 9 -- ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో కొత్త కంటెంట్ చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఈవారం అదిరిపోయే సినిమాలు కొన్ని ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ వారంలోనూ చాలా చిత్రాలు, సిరీస్‍లు ఓటీటీల్లోకి వస్తుండగా.. నాలుగు సినిమాలు, ఓ సిరీస్ తప్పక చూడాల్సినవి అనిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి. ఈ వీకెండ్ చూసేందుకు సిద్ధమవండి.

మరాఠా యోధుడు, ఛత్రవతి సంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఛావా చిత్రం రూపొందింది. ఈ మూవీలో సంభాజీ పాత్ర పోషించారు విక్కీ కౌశల్. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. రూ.780కోట్ల కలెక్షన్లను దాటింది. ఈ ఛావా సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. ఈ వీకెండ్ ఓటీటీలో సినిమా...