Hyderabad, ఫిబ్రవరి 10 -- OTT Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన సోనీ లివ్.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆర్య మేకర్స్ తో కలిసి ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ (The Waking Of a Nation) అనే వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. 106 ఏళ్ల కిందట జలియన్ వాలా బాగ్ లో అప్పటి బ్రిటీష్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ జరిపిన దారుణమైన హత్యాకాండ వెనుక కుట్ర కోణాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఈ సిరీస్ ద్వారా చేయబోతున్నారు.

ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ ఇప్పటి వరకూ పెద్దగా తెలియని చరిత్రను వెలికి తీయబోతోంది. ఈ వెబ్ సిరీస్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి తాజాగా సోమవారం (ఫిబ్రవరి 10) మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.

జలియన్ వాలా బాగ్ మారణకాండ వెనుక కుట్ర కోణాన్ని కనిపెట్టిన లాయర్ కాంతిలాల్ సాహ్ని (త...