భారతదేశం, ఫిబ్రవరి 17 -- జిడ్డీ గర్ల్స్ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. ఈ సిరీస్‍లో అతియా తారా నాయక్, ఉమాంగ్ బదానియా, జైనా అలీ, దీయా దామిని, అనుప్రియ కరోలీ ప్రధాన పాత్రలు పోషించారు. పాపులర్ నటీమణులు సిమ్రన్, నందితా దాస్, రేవతి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అడల్ట్ డ్రామా సిరీస్‍గా ఇది రూపొందింది. నేడు (ఫిబ్రవరి 17) జిడ్డీ గర్ల్స్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది.

ఢిల్లీలోని మటిల్డా హోస్ కాలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ జిడ్డీ గర్ల్స్ సిరీస్ సాగుతుంది. ఆ కళాశాలలో కట్టుబాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి. అయితే అక్కడ చదివేందుకు వచ్చే ఐదుగురు అమ్మాయిలు అక్కడి రూల్స్, పద్దతులను వ్యతిరేకిస్తారు. కట్టుబాట్లను ధిక్కరిస్తారు, తిరుగుబాటు చేస్తారు. దీంతో యూనివర్సిటీలో క్లాష్ ఏర్పడుతుంది. సవాళ్లు ఎదురవుతాయి. వీటి చుట్టూ ఈ సిరీస్...