భారతదేశం, ఫిబ్రవరి 1 -- హీరో ఆది సాయికుమార్ కు చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ ఇచ్చిన మూవీ 'శంబాల'. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అదరగొట్టింది. సీనియర్ హీరో సాయి కుమార్ కొడుకైన ఆది కెరీర్ లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది ఈ మూవీ.

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల జనవరి 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియోలో ఇది అందుబాటులో ఉంది. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ ను ఆహా వీడియో గోల్డ్ సబ్ స్క్రైబర్లు మాత్రం ఒక రోజు ముందు నుంచే చూశారు. ఇప్పుడు శంబాల చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లో అరుదైన మైలురాయిని అందుకుంది.

శంబాల సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటిందని ఆహా వీడియో సోషల్ మీడియాలో ప్రకటించింది. ''100 మిలియన్ ప్లస్ మినిట్స్ స్ట్రీమింగ్. ఆ భయం మరింత పెద్దగా మారింది. శ...