భారతదేశం, మార్చి 24 -- ఈ మార్చి నెల చివరి వారంలోనూ వివిధ ఓటీటీల్లో కొన్ని నయా సినిమాలు, వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రెడీ అవుతున్నాయి. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. ఐదు రిలీజ్‍లపై ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంది. హాలీవుడ్ చిత్రం ముఫాసా తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. హారర్ థ్రిల్లర్ చిత్రం శబ్దం కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఓ వెబ్ సిరీస్ కూడా క్యూరియాసిటీ మధ్య వస్తోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍‍లు ఏవో ఇక్కడ చూడండి.

హాలీవుడ్ బ్లాక్‍బస్టర్ చిత్రం 'ముఫాసా: ది లయన్ కింగ్' ఈ వారంలోనే ఓటీటీలోకి వచ్చేయనుంది. మార్చి 26వ తేదీన ఈ మూవీ జియోహాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. సింహాలు సహా అడవిలోని జంతువులతో సాగే ఈ...