భారతదేశం, ఫిబ్రవరి 4 -- సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన తెలుగు సినిమాల సందడి ఇక ఓటీటీలో షురూ అయింది. ముందుగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' వచ్చేసింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ సినిమా ఇవాళ (ఫిబ్రవరి 4) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇద్దరు భామల మధ్యలో నలిగిపోయే బాయ్ ఫ్రెండ్ కథతో తెరకెక్కిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఇందులో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది.

సంక్రాంతి 2026 బక్సాఫీస్ రేసులో లాస్ట్ గా రిలీజైన మూవీ నారీ నారీ నడుమ మురారి. ఇది జనవరి 14న సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ ఓటీటీలోకి మాత్రం మిగతా తెలుగు...