భారతదేశం, మార్చి 2 -- గణాదిత్య, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో సమ్మేళనం వెబ్ సిరీస్ రూపొందింది. ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా సిరీస్‍కు తరుణ్ మాధవ్ దర్శకత్వం వహించారు. స్నేహం, ప్రేమ మధ్య సాగే ఈ సిరీస్ ట్రైలర్ మెప్పించింది. దీంతో ఈ సిరీస్‍పై ఇంట్రెస్ట్ పెరిగింది. స్ట్రీమింగ్‍కు వచ్చాక సమ్మేళనం సిరీస్‍కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సిరీస్ మంచి వ్యూస్ సాధిస్తోంది.

సమ్మేళనం వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఓ మైలురాయి దాటింది. 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను ఈ సిరీస్ అధిగమించింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సిరీస్ ఈటీవీ విన్‍లో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.

సమ్మేళనం వెబ్ సిరీస్‍లో ప్రియా వడ్లమామి, గాణాదిత్యతో పాటు శివాంత్, బిందు నూతక్కి, విఘ్నయ్ అభిషేక్ లీడ్ రోల్స్ చేశారు. శ్రీకాంత్ గుర్రం, జీవన్ ప్రియ కీలకపాత్రల్లో ...