భారతదేశం, మార్చి 25 -- తెలుగు యువ నటుడు రాకేశ్ వర్రే హీరోగా నటించిన 'ఎవ్వరికీ చెప్పొద్దు' చిత్రం 2019 అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రంలో గార్గేయి ఎల్లాప్రగడ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. ఈ మూవీకి బసవ శంకర్ దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత ఇప్పుడు ఎవ్వరకీ చెప్పొద్దు చిత్రం రెండో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తాజాగా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అయితే, రెంటల్ పద్ధతిలో అడుగుపెట్టింది. రూ.99 రెంట్ చెల్లించి ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ ఇప్పటికే స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. రెంట్ లేకుండా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

ఎవ్...