Hyderabad, ఏప్రిల్ 11 -- OTT Telugu Movie: తెలుగులో గతేడాది దీపావళి నాడు రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ క (KA). కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి మరో ఓటీటీలోకి కూడా రావడం విశేషం. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.53 కోట్లు వసూలు చేసింది.

గతేడాది దీపావళి సందర్భంగా తెలుగులో మూడు సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి క మూవీ. వెరైటీ టైటిల్ తో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

చాలా రోజులుగా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి కూడా వచ్చింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ స...