భారతదేశం, ఏప్రిల్ 5 -- తెలుగు హీరో నవదీప్, కన్నడ యంగ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్, ట్రైలర్ నుంచే ఆసక్తిని రేకెత్తించింది. కొరియన్ పాపులర్ సిరీస్ ఐయామ్ సైకోమెట్రిక్‍కు రీమేక్‍గా రూపొందడంతో మరింత అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో టచ్ మీ నాట్ సిరీస్‍కు ఓటీటీలో ప్రస్తుతం మంచి వ్యూస్ దక్కుతున్నాయి.

టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ ఈ శుక్రవారం (ఏప్రిల్ 4) తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు ఒక్కరోజులోనే ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది. తెలుగు విభాగంలో ఈ సిరీస్ ప్రస్తుతం (ఏప్రిల్ 5) ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది.

టచ్ మీ నాట్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీలోనూ జియోహాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఏడు భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. ...