భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఓటీటీలోకి ప్రతి వారం వచ్చినట్లుగానే ఈ వీక్ కూడా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఇవాళ (ఫిబ్రవరి 6) ఒక్కరోజే సుమారు 19 సినిమాల వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఓ తెలుగు సినిమా చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆ మూవీ పేరే నీలకంఠ. టాలీవుడ్ రూరల్ లవ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన నీలకంఠ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా చేశాడు. ఈ సినిమాతోనే మహేంద్రన్ హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమాతో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది.

నీలకంఠ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌తో స్నేహ ఉల్లాల్ అలరించింది. ఇక నీలకంఠ చిత్రంలో మహేంద్రన్‌కు జోడీగా యష్ణ ముతులూరి హీరోయిన్‌గా చేసింది. హీరోహీరోయిన్లతోపాటు రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాక...