భారతదేశం, ఏప్రిల్ 8 -- ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ జానర్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. బాగా వ్యూస్ దక్కుతాయి. అందుకే ఈ జానర్ కంటెంట్‍‍ను ప్లాట్‍ఫామ్‍లు వరుసగా తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీలో 'ఖౌఫ్' అనే వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సిరీస్‍లో మోనికా పవర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ నేడు అధికారికంగా వెల్లడైంది.

ఖౌఫ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (ఏప్రిల్ 8) అధికారికంగా వెల్లడించింది. "కొన్ని గదుల్లో జ్ఞాపకాలు ఉంటాయి. కానీ దీంట్లో భయం ఉంటుంది. ప్రైమ్‍లో ఏప్రిల్ 18 నుంచి కౌఫిర్" అని అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఖౌఫ్ సిరీస్‍కు స్మితా సింగ్ కథను అందించటంతో పాటు షోరన్నర్‌గా వ్యవహరించారు. ఈ...