భారతదేశం, మార్చి 17 -- హాలీవుడ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ 'అనోరా' ఐదు ఆస్కార్లను సాధించింది. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ పాపులర్ అయింది. ఈ ఏడాది ఆస్కార్ వేదికపై బెస్ట్ మూవీతో పాటు మొత్తంగా ఈ సినిమా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికి సీన్ బేకర్ దర్శకత్వం వహించారు. మైకీ మ్యాడిసన్, మార్క్ ఇడిల్‍స్టెయిన్ ప్రధాన పాత్రలు పోషించిన అనోరా మూవీ ఇండియాలో రెంట్ లేకుండా నేడు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. రెగ్యులర్ స్ట్రీమింగ్ షురూ అయింది.

అనోరా చిత్రం నేడు (మార్చి 17) జియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది...