భారతదేశం, మార్చి 26 -- గేమ్ ఛేంజర్ సినిమా మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍కు నిరాశను మిగిల్చింది. ఆయన హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ మూవీ భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా, గేమ్ ఛేంజర్ మూవీ హిందీ వెర్షన్ ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతోంది.

గేమ్ ఛేంజర్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీ వెర్షన్ మాత్రం నెల ఆలస్యంగా మార్చి 7వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది. జీ5లో గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్‍కు సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. తాజాగా ఓ మైల్‍స్టోన్ దాటింది.

గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్ 250 మిలియన్ వాచ్ మినిట్స్ దాటిందని జీ5 ఓటీటీ నేడు (మా...