భారతదేశం, ఫిబ్రవరి 5 -- అనూజ షార్ట్ ఫిల్మ్‌కు వివిధ ఇంటర్నేషనల్ సినీ ఫెస్టివళ్లలో ప్రశంసలు దక్కాయి. హోలీషార్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా మరిన్ని వేదికల్లో ఈ మూవీ ప్రదర్శితమైంది. ఇద్దరు బాలికలతో ఎమోషనల్‍గా సాగే ఈ షార్ట్ ఫిల్మ్‌ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఆస్కార్ 2025 అవార్డులకు నామినేట్ అయ్యాక అనూజ చాలా పాపులర్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ అనూజ షార్ట్ ఫిల్మ్ ఇండియాలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

అనూజ చిత్రం నేడు (ఫిబ్రవరి 5) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. హిందీ, ఇంగ్లిష్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. అమెరికన్ హిందీ షార్ట్ మూవీగా ఈ చిత్రం రూపొందింది.

అనూజ చిత్రంలో సజ్దా పఠాన్, అనన్య షాన్‍భాగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆజం జే గ్రేవ్స్ దర్శకత...