భారతదేశం, ఫిబ్రవరి 18 -- యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' సూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. భారీ కలెక్షన్లను సాధించింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన రిలీజైంది. పాజిటివ్ టాక్‍ను సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే ఇంగ్లిష్‍లో ఓటీటీలోకి వచ్చింది. అయితే, నేడు (ఫిబ్రవరి 18) తెలుగు సహా ఐదు భాషల్లో మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇవే..

ది వైల్డ్ రోబోట్ సినిమా నేడు జియో హాట్‍స్టార్ (డిస్నీప్లస్ హాట్‍స్టార్) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పటికే ఇంగ్లిష్‍లో ఈ చిత్రం అడుగుపెట్టింది. అయితే, ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగు సహా ఐదు భాషల్...