భారతదేశం, ఫిబ్రవరి 2 -- 'ప్యార్ టెస్టింగ్' పేరుతో నయా వెబ్ సిరీస్ వస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్‍లో సత్యజీత్ దూబే, ప్రతిభ బోర్తాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. లవ్ స్టోరీ, కామెడీతో ఈ సిరీస్ ఉండనుంది. ఇద్దరి ప్రేమకథ ఓ అనుకోని మలుపు తిరుగుతుంది. ప్యార్ టెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.

ప్యార్ టెస్టింగ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 14వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్‍ను జీ5 తీసుకొస్తోంది. డేట్‍ను అధికారికంగా ప్రకటించింది.

ప్యార్ టెస్టింగ్ నుంచి ఫస్ట్ లుక్‍ను కూడా జీ5 రివీల్ చేసింది. సత్యజీత్, ప్రతిభ ట్రెడిషనల్ దుస్తుల్లో ఈ పోస్టర్‌లో ఉన్నారు. కుర్తా, సన్‍గ్లాసెస్‍ను సత్యజిత్ ధరించగా.. పింక్ కలర్ శారీ, ఆభరణాలు ధరించి మెరిశారు ప్రతిభ. బ్...