Hyderabad, మార్చి 18 -- OTT Romantic Comedy: తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన మూవీ నెలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబమ్ (NEEK). ఈ సినిమా గత నెల 21న థియేటర్లలో రిలీజైనా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట కన్ఫమ్ అయింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ధనుష్ డైరెక్ట్ చేసిన నీక్ మూవీ వచ్చే శుక్రవారం (మార్చి 21) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇన్నాళ్లూ ఈ తేదీపై పుకార్లు రాగా.. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో పవీష్ నారాయణ్, మాథ్యూ థామస్ లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లే కాకుండా అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, శరత్ కుమార్, వెంకటేశ్ మేనన్, రబియా ఖాతూన్, రమ్య రంగనా...