Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Romantic Comedy: ఓటీటీలోకి కొత్తగా మరో రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న 'మేరే హస్బెండ్ కి బీవీ' థియేటర్లలో రిలీజైనప్పుడు దాని వింత టైటిల్‌తో కొంచెం ఆసక్తి రేపినా, తర్వాత ఆశించినంతగా ఆడలేదు. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ వివరాలు చూడండి.

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బాలీవుడ్ మూవీ మేరీ హస్బెండ్ కీ బీవీ. 'హ్యాపీ భాగ్ జాయేగీ'తో పేరు తెచ్చుకున్న ముదస్సర్ అజీజ్ ఈ సినిమాకు కథ అందించి, దర్శకత్వం వహించాడు. వషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.

ఈ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 18) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే...