భారతదేశం, ఏప్రిల్ 1 -- తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (NEEK)' థియేటర్లలో ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైంది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' పేరుతో విడుదలైంది. తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి దర్శకత్వం వహించారు. ఆయన మేనల్లుడు పవీశ్ నారాయయణన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. తమిళంలో నీక్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు గత నెలలోనే వచ్చినా.. తెలుగు వెర్షన్ మాత్రం ఆలస్యమైంది. అయితే, ఇప్పుడు తెలుగు వెర్షన్ జాబిలమ్మ నీకు అంతకోపమా కూడా అందుబాటులోకి వచ్చేసింది.

'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నీక్ చిత్రం మార్చి 21నే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, తెలుగు వెర్షన్ రాకపోవడంతో ట్విస్ట్ ఎదురైంది. ఇప్పుడు సుమారు పది రోజులు ఆలస్...