భారతదేశం, మార్చి 18 -- తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం డ్రాగన్ సెన్సేషనల్ హిట్ అయింది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో ఈ మూవీ రిలీజైంది. ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన డ్రాన్ చిత్రం ఆరంభం నుంచి సూపర్ టాక్‍తో అంచనాలకు మించి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ మూవీ సరిగ్గా నెలరోజులకు ఓటీటీలోకి వస్తోంది.

డ్రాగన్ చిత్రం ఈవారంలోనే మార్చి 21వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ డేట్‍ను నేడు అఫీషియల్‍గా ప్రకటించింది ఆ ఓటీటీ సంస్థ. "కొన్ని డ్రాగన్లు అతిగా కోప్పడవు. ఎందుకంటే వాటి కమ్‍బ్యాక్ చాలా హాట్‍గా ఉంటుంది. మార్చి 21న డ్రాగన్ చిత్రం తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో వస్తోంది" అని సోషల్ మీడియాలో వెల్లడించింది.

థియేటర్లలో రిలీజైన సరిగ్...