భారతదేశం, మార్చి 17 -- వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ వారం (మార్చి 17 - 22) కూడా రకరకాల జానర్లలో చిత్రాలు రానున్నాయి. వీటిలో ఆరు చిత్రాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ నెలకొని ఉంది. మలయాళ బ్లాక్‍బస్టర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఐదు భాషల్లో ఈ వారమే స్ట్రీమింగ్‍కు రానుంది. బ్రహ్మానందం లీడ్ రోల్ చేసిన చిత్రం కూడా అడుగుపెట్టనుంది. ఐదుసార్లు సాధించిన చిత్రం కూడా వచ్చేసింది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న ఆరు ఇంపార్టెంట్ చిత్రాలు ఇక్కడ తెలుసుకోండి. చూసేందుకు ప్లాన్ చేసుకోండి.

బ్రహ్మా ఆనందం చిత్రం ఈ గురువారం (మార్చి 20) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంద...