భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఈవారం థియేటర్ల రిలీజ్ మాట ఎలా ఉన్నా.. ఓటీటీలో మాత్రం టాప్ మూవీస్ రాబోతున్నాయి. వీటిలో మూడు సంక్రాంతికి రిలీజైనవే కావడం విశేషం. రెండు నెల రోజుల్లోపే రాబోతుండగా.. ఒకటైతే మరీ 20 రోజులకే స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మరి ఆ మూవీస్ ఏవి? ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో అన్నింటి కంటే ముందుగా ఓటీటీలోకి వస్తున్న సినిమా నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అయినా కూడా మూడు వారాల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. ఈ బుధవారం అంటే ఫిబ్రవరి 4 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అడుగుపెట్టబోతోంది. అది కూడా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మరింత ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు.

ప్రభాస్ నటించిన మరో డిజాస్టర్ మూవీ ది రాజా ...