భారతదేశం, ఏప్రిల్ 6 -- మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన అతిరన్ చిత్రం చాలా ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీలో మానసిక సమస్య ఆటిజంతో బాధపడుతున్న అమ్మాయిగా తన నటనతో సాయి పల్లవి మెప్పించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం మలయాళంలో 2019 ఏప్రిల్‍లో రిలీజైంది. మంచి కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. ట్విస్టులతో ఉండే ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ఓటీటీలో అనుకోని అతిథి పేరుతో ఈ అతిరన్ మూవీ అందుబాటులోకి ఉంది.

థ్రిల్లర్ చిత్రాలు ఇష్టమున్న వారికి అతిరన్ బాగా నచ్చేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మతిపోయేలా ఉంటుంది. ఈ చిత్రం ఆసాంతం సస్పెన్స్ కూడా కొనసాగుతుంటుంది. ఒకవేళ ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూడకపోతే మిస్ కాకూడని చిత్రమిది. ఇప్పుడు ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

అతిరన్ సినిమా తెలుగు వెర్షన్ 'అనుకోని అతిథి' చిత్రం ...