Hyderabad, ఏప్రిల్ 9 -- OTT Psychological Thriller: సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఏడాదిన్నర తర్వాత ఓ తమిళ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీ పేరు వెబ్ (Web). ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని బుధవారం (ఏప్రిల్ 9) ఆహా తమిళం ఓటీటీ వెల్లడించింది.

తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వెబ్. ఈ సినిమా ఆగస్ట్, 2023లో రిలీజైంది. అయితే ఇన్నాళ్లూ డిజిటల్ ప్రీమియర్ కు నోచుకోని ఈ మూవీ.. మొత్తానికి ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. క్వాలిటీ థ్రిల్లర్ మూవీ కావాలా.. అయితే ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానున్న వెబ్ చూడండి అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.

సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వెబ్ ఆగస్ట్ 4, 2023లో రిలీజైంది. హరూన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నట్టి...