Hyderabad, ఫిబ్రవరి 6 -- OTT Mythological Action Movie: తెలుగులో రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన మైథలాజికల్ యాక్షన్ మూవీ దేవకి నందన వాసుదేవ. ఈ సినిమా ఇప్పటి వరకూ ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ పై ఇప్పుడో వార్త ఆసక్తి రేపుతోంది. అదేంటంటే.. ఈ సినిమా హిందీ వెర్షన్ మొదట ఓటీటీలోకి రానుంది. అదే సమయంలో టీవీ ప్రీమియర్ కూడా కానుండటం విశేషం.

హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన సినిమా దేవకి నందన వాసుదేవ. అశోక్ గల్లా లీడ్ రోల్లో నటించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇందులో నటించాడన్న వార్తతో ఈ మూవీకి చాలా హైప్ వచ్చింది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేదు. గతేడాది నవంబర్ 22నే రిలీజ్ కాగా.. ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాలేదు. అయితే ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రం శనివారం (ఫిబ్రవరి 8) నుంచి డిస్న...