భారతదేశం, ఏప్రిల్ 20 -- కన్నడ నటి ఖుషి రవి ప్రధాన పాత్ర పోషించిన అయ్యన మనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ కన్నడ సిరీస్‍కు రమేశ్ ఇందిర దర్శకత్వం వహించారు. రీసెంట్‍గా వచ్చిన ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.

అయ్యన మనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కన్నడలో రూపొందిన ఈ సిరీస్ ఇతర భాషల డబ్బింగ్‍లోనూ వస్తుందేమో చూడాలి.

1990ల బ్యాక్‍డ్రాప్‍లో అయ్యన మనే వెబ్ సిరీస్ సాగుతుంది. చిక్కమాగళూరూలోని ఓ పూర్వికుల భవనంలో అయ్యన మనే కుటుంబం ఉంటుంది. ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన ముగ్గురు అమ్మాయిలు వరుసగా మరణిస్తారు. వారు చనిపోయిన విషయాన్ని ఆ కుటుంబం దాచేస్తుంద...