భారతదేశం, మార్చి 9 -- రేఖాచిత్రం సినిమా థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్‍తో కమర్షియల్‍గా సక్సెస్ సాధించింది. ఈ మూవీలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రీసెంట్‍గా ఓ ఓటీటీలోకి వచ్చి భారీగా వ్యూస్ సాధిస్తోంది. అయితే, రేఖాచిత్రం తెలుగు వెర్షన్ మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..

రేఖాచిత్రం సినిమా మూడు రోజుల కిందటే (మార్చి 6) సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోనూ అడుగుపెట్టింది. అయితే, ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోకి కూడా రానుందని సమాచారం. రేఖాచిత్రం తెలుగు వెర్షన్ మార్చి 14వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని ఓటీటీ ప్లే ...