Hyderabad, జనవరి 30 -- OTT Movies: థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల కోసం శుక్రవారం (జనవరి 31) రెండు సినిమాలు రాబోతున్నాయి. జీ5, ఆహా వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ రెండు మూవీస్ వస్తున్నాయి. వీటిలో ఒకటి కాఫీ విత్ ఎ కిల్లర్ కాగా.. మరొకటి ఐడెంటిటీ. కామెడీ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్లలో రూపొందిన ఈ మూవీస్ ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయి.

ఓటీటీలోకి మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ (Identity) వచ్చేస్తోంది. శుక్రవారం (జనవరి 31) నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయొచ్చు. టొవినో థామస్, త్రిష నటించిన మూవీ ఇది.

ఈ ఏడాది జనవరి 2న రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. జనవరి 24న తెలుగులోనూ థియే...