భారతదేశం, మార్చి 10 -- టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం ఎట్టకేలకు ఈవారం ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో రిలీజైన దాదాపు 23 నెలలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. బబర్దస్త్ 'ధనరాజ్' దర్శకత్వం వహించిన మూవీ రెండు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇలా ఓటీటీల్లో ఈవారం ఇంట్రెస్టింగ్ చిత్రాలు వస్తున్నాయి. ఓ మలయా చిత్రం తెలుగు డబ్బింగ్‍లో వస్తోంది. ఈ వారం (మార్చి 10 -15) తెలుగులో ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

ఏజెంట్ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 14) సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ 2023 ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే, నెగెటివ్ టాక్ తెచ్చుకొని భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏజెంట్ చిత్రం ఎప్పుడు ఓటీ...