Hyderabad, మార్చి 18 -- OTT Mammootty Thriller Movies: మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి వరుసబెట్టి సినిమాలు చేస్తూనే ఉంటాడు. వాటిలో కొన్ని థ్రిల్లర్ మూవీస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఆ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో భ్రమయుగం, రోర్షాక్, కన్నూర్ స్క్వాడ్ లాంటి సినిమాలు ఉన్నాయి.

మలయాళం ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరుగాంచిన హీరో మమ్ముట్టి. ఇప్పటికే 400కుపైగా సినిమాల్లో నటించాడు. 73 ఏళ్ల వయసులోనూ ఇంకా నటిస్తూనే ఉన్నాడు. మరి అతడు నటించిన సినిమాల్లో బెస్ట్ అనిపించే 5 థ్రిల్లర్ మూవీస్ ఏంటో చూద్దాం.

భ్రమయుగం 17వ శతాబ్దపు కేరళ బ్యాక్‌డ్రాప్ లో సాగే మూవీ. ఇందులో తేవన్ అనే పాణన్ కులానికి చెందిన జానపద గాయకుడు బానిసల మార్కెట్ నుండి తప్పించుకుని ఒక రహస్యమైన భవనంలోకి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక దుష్ట శక్తి ఎదురవుతుంది. ...