Hyderabad, ఫిబ్రవరి 10 -- OTT Malayalam Movies: మలయాళం మూవీ లవర్స్ కోసం ఈ వాలెంటైన్స్ డే వీక్ లోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తున్నాయి. వీటిని సోనీ లివ్, హాట్‌స్టార్, మనోరమ మ్యాక్స్ లలో చూడొచ్చు. ఈవారం రాబోతున్న వాటిలో ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఈ సిరీస్ తోపాటు యాక్షన్ థ్రిల్లర్ సినిమా మార్కోను కూడా తెలుగులో చూడొచ్చు.

ఓటీటీలోకి ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 మధ్య మూడు మలయాళం సినిమాలు, ఓ వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కోతోపాటు ఓరు కట్టిల్ ఓరు మురి, మనోరాజ్యం అనే సినిమాలు.. లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ అనే వెబ్ సిరీస్ వస్తున్నాయి. మరి దేనిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

గతేడాది థియేటర్లలో రిలీజై మోస్ట్ వయోలెంట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా నిలిచిన మార్కో మూవీ మొత్తానికి ఓ...