Hyderabad, ఏప్రిల్ 4 -- OTT Malayalam Comedy: మలయాళం కామెడీ సినిమాలు అంటే ఇష్టమా? అయితే మీకోసం మరో కామెడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా గతేడాది మేలో థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ సినిమా పేరు కుదుంబ స్త్రీయుమ్ కుంజదుమ్. టైటిలే వెరైటీ ఉంది కదూ.

మలయాళం కామెడీ మూవీ కుదుంబ స్త్రీయుమ్ కుంజదుమ్ గతేడాడి మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ కు అర్థం ఏంటంటే గృహిణి ఓ గొర్రె అని. ఈ కామెడీ డ్రామా శుక్రవారం (ఏప్రిల్ 4) సడెన్ గా సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలోకి వచ్చింది.

ఓటీటీప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సినిమాను చూడొచ్చు. ధ్యాన్ శ్రీనివాసన్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఏడాదిగా ఈ మూవీకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ దొరకలేదు. మొత్తానికి ఇప్పుడు సన్ నెక్ట్స్ లోకి వచ్చింది.

ఈ కుదుం...