Hyderabad, ఫిబ్రవరి 13 -- OTT Malayalam Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ, గతేడాది బాక్సాఫీస్ దగ్గర రూ.115 కోట్లు వసూలు చేసిన మార్కో ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.

మార్కో మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని సోనీ లివ్ (Sony Liv) ఓటీటీ చాలా రోజుల కిందటే అనౌన్స్ చేసింది. ఆ లెక్కన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూవీ వస్తుందని అందరూ భావించారు. కానీ సడెన్ గా మధ్యాహ్నం నుంచే మార్కో స్ట్రీమింగ్ మొదలైంది.

ఈ విషయాన్ని సోనీ లివ్ ఓటీటీ కూడా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "యుద్ధం మొదలైంది. మార్కో వచ్చేశాడు" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. ఊహించిన దాని కంటే ఒక రోజు ముందే మార్కో ఓటీటీలోకి రావడం అభిమానులక...