భారతదేశం, మార్చి 20 -- కన్నడ యంగ్ యాక్టర్ నవీన్ శంకర్ హీరోగా నటించిన నొడిదవరు ఎనంతారే చిత్రం ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రానికి కుల్దీప్ కరియప్ప దర్శకత్వం వహించారు. నొడిదవరు ఎనంతారే మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.

నొడిదవరు ఎనంతారే మూవీ రేపు (మార్చి 21) అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందనే సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికి కన్నడలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. డబ్బింగ్ వెర్షన్‍లపై క్లారిటీ లేదు. కన్నడ మాత్రం అందుబాటులోకి రానుంది.

నొడిదవరు ఎనంతారే మూవీలో జీవితంలో వరుసగా కష్టాలను ఎదుర్కొనే యువకుడిగా నటనతో మెప్పించారు నవీన్ శంకర్. ఈ చిత్రాన్ని భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు దర్శకుడు కుల్దీప్ కరియయప్ప. అపూర్వ భరద్వాజ్, పద్మ...