భారతదేశం, ఏప్రిల్ 12 -- తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన కింగ్‍స్టన్ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మంచి హైప్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అంచనాలను అందుకోలేక కమర్షియల్‍గా ప్లాఫ్‍గా నిలిచింది. ఈ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీకి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ కింగ్‍స్టన్ చిత్రం స్ట్రీమింగ్‍కు సమయం ఆసన్నమైంది.

కింగ్‍స్టన్ సినిమా రేపు (ఏప్రిల్ 13) మధ్యాహ్నం 12 గంటలకు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. దీంతో మరికొన్ని గంటల్లో ఈ చిత్రాన్ని జీ5లో చూడొచ్చు.

ఒకే సమయానికి ఓటీటీతో పాటు టీవీ ప్రీమియర్‌కు కింగ్‍స్టన్ సినిమా రానుంది. అందుకే అర్ధరాత్రి కాకుండా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ చిత్రం జీ5 ఓటీటీలోకి ఎ...