Hyderabad, ఫిబ్రవరి 4 -- OTT Horror Crime Thriller Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో గతేడాది వచ్చిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఇది తమిళంలో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా నిలిచింది. ఐఎండీబీలో 7.2 రేటింగ్ సాధించిన ఈ హారర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ మీరు చూసి ఉండకపోతే.. వెంటనే చూసేయండి.

ప్రముఖ నటుడు నవీన్ చంద్ర నటించిన వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఇదొక తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినా.. తెలుగు, హిందీలాంటి ఇతర భాషల్లోనూ వచ్చింది. ఈ జానర్లో అత్యధిక మంది చూసిన తమిళ వెబ్ సిరీస్ ఇదే.

ఇందులో నవీన్ చంద్రతోపాటు సునయన, కన్నా రవి, మాలిని జీవరత్నం, కుమారవేల్, మిషా ఘోషాల్ లాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ గతేడాది ఓటీటీలోకి రాగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో అయ...