Hyderabad, మార్చి 26 -- OTT Highest Paid Actor: ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత టీవీ స్టార్లతోపాటు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి కూడా పెద్ద పెద్ద స్టార్లు వెబ్ సిరీస్ లలో నటించడం మొదలుపెట్టారు. కానీ వీళ్లందరికీ ఓ స్టార్ హీరో మాత్రం ఒకే సీజన్ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.125 కోట్లు వసూలు చేశాడంటే నమ్మగలరా? ఆ హీరో పేరు అజయ్ దేవగన్.

రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ 2022లో జియోహాట్‌స్టార్ లో వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించాడు. ఆ మధ్య నెట్‌ఫ్లిక్స్ లో హీరామండి వెబ్ సిరీస్ రాక ముందు వరకు దేశంలో అత్యధిక బడ్జెట్ వెబ్ సిరీస్ ఈ రుద్రనే. ఇప్పటి వరకూ ఒక్క సీజన్ మాత్రమే స్ట్రీమింగ్ అయింది. లూథర్ పేరుతో వచ్చిన బ్రిటీష్ సిరీస్ కు ఇది ఇండియన్ రీమేక్.

దీనికోసం 2021లో అజయ్ దేవగన్ సైన...