భారతదేశం, మార్చి 25 -- సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో హోమ్‍టౌన్ వెబ్ సిరీస్ వస్తోంది. కొడుకును విదేశాల్లో చదివించాలని కలలు కనే మధ్య తరగతి తండ్రిగా ఈ సిరీస్‍లో రాజీవ్ నటించారు. 2000ల బ్యాక్‍డ్రాప్‍లో మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ చుట్టూ సాగే ఈ సిరీస్‍లో ప్రజ్వల్ యద్మ, యానీ కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. 90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్ లాంటి సక్సెస్‍ఫుల్ సిరీస్‍ను ప్రొడ్యూజ్ చేసిన నవీన్ మేడారమే ఈ సిరీస్‍కు షోరన్నర్‌గా ఉన్నారు. హోమ్‍టౌన్ సిరీస్ ట్రైలర్ నేడు (మార్చి 25) రిలీజైంది.

మధ్యతరగతి కుటుంబంలో జరిగే పరిస్థితులతో హోమ్‍టౌన్ సిరీస్ ట్రైలర్ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కొడుకును విదేశాల్లో చదివించాలని అనుకునే తండ్రి.. చదువు ఇష్టం లేని కొడుకు ఇలా ట్రైలర్ సాగింది. ఫొటో స్టూడియో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు రాజీవ్ కన...