భారతదేశం, జనవరి 26 -- మలయాళ సినిమా 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' చాలా పాపులర్ అయింది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం 2021లో ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొత్తగా పెళ్లయిన అమ్మాయి..ఎదుర్కొనే సవాళ్లు, కష్టాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. నిమిషా సంజయ్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భారీ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా 2023లో తమిళంలో రీమేక్ అయింది. ఇప్పుడు హిందీలోనూ ఈ సినిమా రీమేక్‍ అయింది. 'మిసెస్' (Mrs.) పేరుతో హిందీలో ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది. డేట్ ఖరారైంది.

మిసెస్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో సాన్య మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ ట్రైలర్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం నేరుగా జీ5 ఓటీటీలో అడుగుపెట్టనుంది.

మిసెస్ మూవీకి ఆర్తి కడవ్ దర్శక...