భారతదేశం, మార్చి 18 -- తమిళ హీరో జై, సీనియర్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో బేబీ అండ్ బేబీ సినిమా వచ్చింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కింది. ఈ బేబీ అండ్ బేబీ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

బేబీ అండ్ బేబీ సినిమా ఈ శుక్రవారం (మార్చి 21) సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. "డబుల్ ఫన్‍కు రెడీగా ఉండండి. బేబీ అండ్ బేబీ మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ అవనుంది" అని సోషల్ మీడియాలో సన్‍నెక్స్ట్ పోస్ట్ చేసింది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాలకు బేబీ అండ్ బేబీ స్ట్రీమింగ్‍కు వస్తోంది.

బేబీ అండ్ బేబీ చిత్రంలో జై, సత్యరాజ్‍తో పాటు యోగిబాబు, ప్రగ్యా నగ్రా, కీర్తన, సాయిధన్య, ఇళవరసు, శ్రీమాన్, ఆనందరాజ్, నిళయగ...