Hyderabad, మార్చి 6 -- OTT Drama Thriller Movie: రామం రాఘవం మూవీ థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వస్తోంది. బుధవారం (మార్చి 5) ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని సన్ నెక్ట్స్ ఓటీటీ వెల్లడించగా.. గురువారం (మార్చి 6) ఈటీవీ విన్ కూడా అనౌన్స్ చేసింది. ఈ రెండూ ఒకే రోజు మూవీని తీసుకురానుండటం విశేషం.

కమెడియన్ ధనరాజ్ నటించి, డైరెక్ట్ చేసిన మూవీ రామం రాఘవం. ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైనా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. అది కూడా ఒకేసారి రెండు ప్లాట్‌ఫామ్స్ లోకి కావడం విశేషం. ఈటీవీ విన్, సన్ నెక్ట్స్ రెండూ మార్చి 14 నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నాయి.

హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమాను తీసుకొస్తున్నాయి. "ఈ హోలీ.. ఎమోషన్, డ్రామా రంగుల్లో మునిగి తేలుదాం. రామం రాఘవంతో సెలబ్రేట్ ...